ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: విచారణ రేపటికి వాయిదా

Inner Ring Road case hearing adjourned
  • చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
  • విచారణ రేపటికి వాయిదా 
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి. ఈ కేసులో చంద్రబాబు ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. నేటి విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, క్విడ్ ప్రోకో జరిగిందని కోర్టుకు తెలిపారు. భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని ఏజీ వివరించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Go Back to Shorts
Inner Ring Road Case
Chandrababu
Anticipatory Bail
AP High Court
TDP
CID

More Telugu News