Chandrababu: యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

Chandrababu visits CM KCR at Yashoda Hospital in Hyderabad
  • ఇటీవల బాత్రూంలో జారిపడిన కేసీఆర్
  • యశోదా ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి
  • ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్
  • కేసీఆర్ తో కొద్దిసేపు మాట్లాడిన బాబు   

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఇటీవల తన ఫాంహౌస్ వద్ద బాత్రూంలో జారిపడ్డారు. యశోదా ఆసుపత్రిలో ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఈ సాయంత్రం యశోదా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లిన చంద్రబాబు... నమస్కారమండీ అంటూ కేసీఆర్ కు అభివాదం చేశారు. ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. 

కేసీఆర్ కొంచెం నీరసంగా మాట్లాడుతుండడంతో... ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Loading...

More Telugu News