Nara Lokesh: యువగళం పాదయాత్రలో దేవాన్ష్ చేయి పట్టుకొని పరుగు తీసిన నారా లోకేశ్

Nara Devansh run with father lokesh in yuvagalam padayatra

  • లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న నారా దేవాన్ష్
  • తండ్రితో కాలు కదిపిన తనయుడు
  • పాదయాత్రలో పాల్గొన్న నారా బ్రాహ్మణి

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. లోకేశ్ పాదయాత్రలో తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. నాన్నతో కలిసి కాలు కదిపారు. అంతేకాదు... తనయుడి చేయి పట్టుకొని లోకేశ్ కాసేపు పరుగు తీశారు. దేవాన్ష్ తండ్రితో కలిసి పరుగు పెట్టడం అక్కడున్న వారికి ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాదయాత్రలో నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు. లోకేశ్ ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్రను ప్రారంభించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రెండు నెలల పాటు యాత్రకు బ్రేక్ వచ్చింది. తండ్రి జైలు నుంచి బయటకు వచ్చాక లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. నవంబర్ 26న తూర్పు గోదావరి రాజోలు నుంచి యాత్రను ప్రారంభించారు.

Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
Yuva Galam Padayatra
  • Loading...

More Telugu News