alla ramakrishna reddy: పార్టీని ఇబ్బంది పెట్టకూడదనే మౌనంగా ఉన్నాం: ఆర్కే రాజీనామాపై మాజీ ఎమ్మెల్యే కమల

Former MLA on RK risignation
  • ఎమ్మెల్యే పదవికి, వైసపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రాజీనామా
  • ఆర్కే ఇలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్న కాండ్రు కమల
  • టిక్కెట్ రేసులో తానూ ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే వెల్లడి

వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆళ్ల రాజీనామాపై మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల స్పందించారు. ఆర్కే ఇలా చేయడం సరికాదని, పార్టీకి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెల రోజులు మాత్రమే తమతో సఖ్యతగా ఉన్నారని, ఆ తర్వాత పలు కార్యక్రమాలకు ఆయన తమను దూరం పెట్టారని ఆరోపించారు. పార్టీని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతోనే తాము ఇప్పటి వరకు మౌనంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఆర్కే గెలుపు... ఆయనకు మెజార్టీ రావడంలో తన పాత్ర ఎంతో ఉందన్నారు. తాను కూడా ఈసారి మంగళగిరి నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ అంటే కుదరదన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News