rs praveen kumar: కేసీఆర్‌ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... బీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్

RS Praveen Kumar meets KCR in Yashoda
  • కేటీఆర్‌ను కలిసి ఆరోగ్యంపై ఆరా
  • కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలన్న బీఎస్పీ తెలంగాణ చీఫ్
  • కేసీఆర్‌ను అంతకుముందు పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీమ్ ఆర్మీ అధినేత ఆజాద్ పరామర్శించారు. ఆ తర్వాత మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిసి.. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మళ్లీ ప్రజల్లో తిరగాలన్నారు. కేసీఆర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించిన ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీ హన్మంతరావు తదితరులు కలిశారు.
rs praveen kumar
KCR
BRS

More Telugu News