మోసగించిన జగన్ హాయిగా ఉన్నాడు.. మోసపోయిన మీరెందుకు చావాలి?: నారా లోకేశ్
- టీచర్ ఆత్మహత్యాయత్నంపై నారా లోకేశ్ స్పందన
- దోచి దాచుకున్న సొమ్ముతో జగన్ మోసపు రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడని ఫైర్
- దగాకోరు జగన్ పై అందరం కలిసి పోరాడుదామని పిలుపు
అరాచక పాలనలో అక్షరాలు నేర్పే గురువులు ఆత్మహత్యాయత్నం చేయడం చాలా దారుణమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని గద్దెనెక్కి 200 వారాలు దాటినా జగన్ అమలు చేయలేదని మండిపడ్డారు. జీపీఎస్ పేరుతో జగన్ మరో వంచనకి తెరలేపాడని అన్నారు. జీతాలు ఏ నెలా సకాలంలో ఇవ్వడంలేదన్నారు. వీటికి తోడు బోధనేతర పనులు, తనిఖీల పేరుతో టీచర్లను సీఎం జగన్ వేధిస్తున్నాడని ఆరోపించారు. సర్కారు అరాచకాలపై ఉద్యోగులు, కర్షక కార్మికులంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి టీడీపీ అండగా నిలబడుతుందని, అంతా కలిసి జగన్ ను ఇంటికి పంపిద్దామని లోకేశ్ చెప్పారు.