బండారు దత్తాత్రేయ మనవరాలి పాటకు పరవశించిన ప్రధాని మోదీ

PM Modi appreciates Bandaru Dattatreya grand daughter song
  • మోదీ గొప్పదనం గురించి పాటపాడిన బండారు దత్తాత్రేయ మనవరాలు
  • ఎంతో సృజనాత్మకంగా, మనసుకు హత్తుకునేలా ఉందన్న మోదీ
  • ఆ చిన్నారి మాటలు గొప్ప శక్తినిస్తాయని వెల్లడి 
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఓ పాట పాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీని కీర్తిస్తూ ఆ చిన్నారి ఆలపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బండారు దత్తాత్రేయ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

కాగా, దత్తన్న మనవరాలి వీడియోను ప్రధాని మోదీ కూడా చూశారు. ఆ చిట్టితల్లిని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఆ చిన్నారి పాడిన పాట ఎంతో సృజనాత్మకంగా, మనసుకు హత్తుకునేలా ఉందని మెచ్చుకున్నారు. ఆమె మాటలు గొప్ప శక్తినిచ్చేలా ఉన్నాయని కొనియాడారు.
Go Back to Shorts
PM Modi
Bandaru Dattatreya
Jasodhara
Grand Daughter
Song
Video
BJP

More Telugu News