ఇక ప్రజల సర్కారు పని మొదలైంది: రాహుల్ గాంధీ
- తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
- డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క... మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం
- రేవంత్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
- బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామంటూ ట్వీట్
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. "ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రుల బృందానికి శుభాభినందనలు. ఇక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని మొదలైంది. బంగారు తెలంగాణ కలను మేం సాకారం చేస్తాం. మేం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటాం" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.