Hamas: ఇజ్రాయెల్ ను అడ్డుకునే ధైర్యసాహసాలు పాకిస్థాన్ కు మాత్రమే ఉన్నాయి: హమాస్ నేత

Hamas leader Ismail Hania says only Pakistan can halt Israel
  • ఇజ్రాయెల్ ను పాక్ మాత్రమే ఎదుర్కోగలదన్న ఇస్మాయిల్ హనియా
  • పాక్ ప్రతిఘటనతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందని వ్యాఖ్యలు
  • ఇజ్రాయెల్ ను ఢీకొట్టగల శక్తి  పాక్ కు ఉందని స్పష్టీకరణ

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరమైన నేపథ్యంలో హమాస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సొరంగాల్లో దాగిన హమాస్ మిలిటెంట్లను బయటికి రప్పించేందుకు ఇజ్రాయెల్ కృత్రిమ వరదలు సృష్టిస్తోంది. భారీగా నీటిని ఆ సొరంగాల్లోకి పంపడంతో హమాస్ దళాలు బయటికి రాక తప్పడంలేదు. 

ఈ నేపథ్యంలో, హమాస్ నేత ఇస్మాయిల్ హనియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖతార్ నుంచి హమాస్ కార్యకలాపాలు నిర్వహించే హనియా పాకిస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పాలస్తీనాను నేలమట్టం చేస్తున్న ఇజ్రాయెల్ ను అడ్డుకోగలిగిన శక్తి ఏదైనా ఉందంటే అది పాకిస్థానే అని స్పష్టం చేశారు. 

ఇజ్రాయెల్ ను పాకిస్థాన్ నిలువరిస్తే... ఈ దారుణమైన సంక్షోభానికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ఇజ్రాయెల్ ను ఎదుర్కోగల ధైర్యసాహసాలు పాకిస్థాన్ కు ఉన్నాయని హనియా ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News