Nara Lokesh: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం... నారా లోకేశ్ ట్వీట్

Nara Lokesh congratulates Revanth Reddy
  • రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్  
  • పదవీ కాలం విజయవంతం కావాలంటూ ట్వీట్
  • మంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో సీతక్కకు అనుకూలంగా నినాదాలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. మీ పాలనా పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎల్బీ స్టేడియంకు తరలి వచ్చారు. ఇదిలా ఉండగా, మంత్రిగా సీతక్క ప్రమాణం చేసిన సమయంలో ఎల్బీ స్టేడియంకు వచ్చిన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. పెద్ద ఎత్తున అభిమానులు సీతక్కకు అనుకూలంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News