Rahul Gandhi: ఇక ప్రజల సర్కారు పని మొదలైంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi says peoples govt work has begun in Telangana
  • తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
  • డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క... మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం
  • రేవంత్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
  • బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామంటూ ట్వీట్
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. "ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రుల బృందానికి శుభాభినందనలు. ఇక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని మొదలైంది. బంగారు తెలంగాణ కలను మేం సాకారం చేస్తాం. మేం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటాం" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Rahul Gandhi
Revanth Reddy
Congress
Telangana

More Telugu News