నా దృష్టిలో శ్రీలీల'ఎక్స్ట్రార్డినరీ ఉమెన్' : హీరో నితిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా దృష్టిలో శ్రీలీల'ఎక్స్ట్రార్డినరీ ఉమెన్' : హీరో నితిన్

Extra Ordinary Man Pre Release Event
  • నితిన్ హీరోగా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్'
  • ఆయన జోడీ కట్టిన శ్రీలీల
  • ఆమె టాలెంట్ గురించి ప్రస్తావించిన నితిన్ 
  • తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారని వ్యాఖ్య

నితిన్ - శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో నితిన్ మాట్లాడుతూ, "మా ఫాదర్ కి డిస్ట్రిబ్యూటర్ గా ఫస్టు సినిమా రాజశేఖర్ గారి 'మగాడు'. ఆ సినిమా హిట్ కావడం వల్లనే మా ఫాదర్ ఈ ఫీల్డ్ లో నిలబడ్డారు" అని అన్నాడు. 

"ఆ సినిమాతో మా ఫాదర్ నిలదొక్కుకోవడం వల్లనే హీరోగా నేను ఎంట్రీ ఇచ్చాను. అంటే .. ఒక రకంగా ఈ రోజున నేను ఇక్కడ నిలబడటానికి కారణం రాజశేఖర్ గారు అనే చెప్పాలి. రాజశేఖర్ గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం మాకు హెల్ప్ అయింది. అందుకు మా టీమ్ అంతా ఆయనకి థ్యాంక్స్ చెబుతోంది" అన్నాడు. 

"శ్రీలీల మంచి డాన్సర్ అని నాకు తెలుసు. ఆమెకి భరతనాట్యం తెలుసు .. కూచిపూడి తెలుసు .. మంచి హాకీ ప్లేయర్ .. స్విమ్మింగ్ లో రికార్డు ఉంది .. వీణ వాయించడంలో మంచి ప్రవేశం ఉంది .. త్వరలో మెడిసిన్ పూర్తి చేయబోతోందనే విషయం తక్కువ మందికి తెలుసు. అందువలన నా దృష్టిలో తను ఎక్స్ట్రా ర్డినరీ ఉమెన్' అన్నాడు. ఈ నెల 8న తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు" అని చెప్పాడు. 
Advertisement
Extra Ordinary Man
Nithin
Sreeleela
Vakkantham Vamsi

More Telugu News