Ambati Rambabu: కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ శ్రేణులు సెలెబ్రేట్ చేసుకున్నాయి: అంబటి రాంబాబు

TDP followers celebrated Congress victory says Ambati Rambabu
  • టీడీపీ, జనసేన అనైతిక పొత్తులు పెట్టుకున్నాయని అంబటి మండిపాటు
  • తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ పరోక్ష మద్దతును ఇచ్చిందని విమర్శ
  • బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసిందని ఎద్దేవా
తెలుగుదేశం, జనసేన పార్టీలు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నప్పటికీ... కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతును ప్రకటించిందని అన్నారు. జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసిందని చెప్పారు. మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. ఈ అనైతిక పొత్తులు ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని టీడీపీ శ్రేణులు సెలెబ్రేట్ చేసుకున్నాయని దుయ్యబట్టారు. గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలతో కోలాహలం సృష్టించారని విమర్శించారు. ఏపీలో టీడీపీ కార్యాలయానికి జనసేన జెండాలు కట్టారని చెప్పారు. ఈ పార్టీల వాళ్లకు సిగ్గూ శరం లేవని అన్నారు. 

Ambati Rambabu
YSRCP
Telugudesam
Janasena
BJP

More Telugu News