Anil Ravipudi: ఇక మెగాస్టార్ తోనే అనిల్ రావిపూడి సినిమా!

Chiranjeevi in Anil Ravipudi Movie
  • బాలయ్యతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 
  • మెగాస్టార్ నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్
  • వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్ట్ 
  • ఈ లోగా రవితేజతో 'రాజా ది గ్రేట్' సీక్వెల్  

అనిల్ రావిపూడి .. తమ సినిమాలకి తామే కథ ... స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చుకునే చాలా తక్కువమంది దర్శకులలో ఆయన ఒకరు. అలాగే తమ కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ హిట్స్ ను మాత్రమే ఇచ్చిన అతి తక్కువమందిలోను ఆయన ఒకరు. అలాంటి అనిల్ రావిపూడి .. మెగాస్టార్ తో సినిమా చేయనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. 

ఇటీవలే బాలయ్యతో 'భగవంత్ కేసరి' సినిమాను తెరకెక్కించి, అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చిరంజీవికి ఒక కథను వినిపించడం .. ఆ కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీవశిష్ఠ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవి, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని అంటున్నారు. 

ఆయితే ఈ గ్యాప్ లో రవితేజతో అనిల్ రావిపూడి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రాజాపై ది గ్రేట్' సినిమాకి ఇది సీక్వెల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో అనిల్ రావిపూడి ఉన్నాడని అంటున్నారు. 
Anil Ravipudi
Chiranjeevi
Raviteja

More Telugu News