Liquor: తెలంగాణలో మందుబాబులకు అలర్ట్!

Tomorrow wine shops and bars in Telangana will be closed due to election countin
  • రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు
  • పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
  • రేపు వైన్ షాపులు, బార్లను మూసేయాని ఆదేశం
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రేపు వైన్ షాపులు, బార్లను మూసేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
Liquor
Telangana
Telangana Elections
Results

More Telugu News