Chandrababu: జేపీ నడ్డాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu wishes JP Nadda on his birthday
  • నేడు జేపీ నడ్డా పుట్టినరోజు
  • నడ్డాపై సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ
  • ఎక్స్ లో స్పందించిన చంద్రబాబు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నడ్డాకు శుభాకాంక్షలు తెలిపారు. 

"నడ్డా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలిగేలా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

సెప్టెంబరు 9న స్కిల్ కేసులో అరెస్టయ్యాక సోషల్ మీడియాలో చంద్రబాబు ఎక్స్ ఖాతా నుంచి ఇటీవల వరకు పోస్టులు రాలేదు. నిన్న చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో తిరుమల పర్యటన, గన్నవరం ర్యాలీ ఫొటోలను పోస్టు చేయడం ద్వారా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇవాళ నడ్డాకు శుభాకాంక్షలు చెబుతూ రెండో పోస్టు చేశారు.
Chandrababu
JP Nadda
Birthday
TDP
BJP

More Telugu News