Mitchell Marsh: కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతాను: మిచెల్ మార్ష్

Mitchell Marsh says he would again rest his feet on world cup
  • వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్
  • విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా
  • డ్రెస్సింగ్ రూంలో వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని కూర్చున్న మార్ష్
  • ఫొటో వైరల్... మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు
భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే డ్రెస్సింగ్ రూంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా... మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. 

దీనిపై మిచెల్ మార్ష్ స్పందించాడు. తానేమీ వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని స్పష్టం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై తాను పెద్దగా ఆలోచించలేదని మార్ష్ వెల్లడించాడు. 

దీని గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందని, కానీ అందులో ఏముందని అంతలా మాట్లాడుకుంటున్నారని మార్ష్ ప్రశ్నించాడు.
Mitchell Marsh
World Cup
Feet
Australia

More Telugu News