నారాయణపూర్ లో మొరాయించిన ఈవీఎంలు
- ఇల్లందులోని బయ్యారంలో నిలిచిన ఓటింగ్
- ఈవీఎం మొరాయించడంతో రెండు గంటలు ఓటర్ల పడిగాపులు
- టెక్నీషియన్ సరిచేయడంతో మళ్లీ మొదలైన పోలింగ్
ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 2 గంటల పాటు ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద పడిగాపులు కాశారు. అక్కడే అందుబాటులో ఉన్న టెక్నీషియన్ ఈవీఎంను రిపేర్ చేయడంతో మళ్లీ పోలింగ్ మొదలైంది. ఈ ఘటనపై మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఇమ్మాన్యుయెల్ స్పందిస్తూ.. నారాయణపురం ఈవీఎం మొరాయించిన విషయం తెలిసిన వెంటనే స్పందించామని చెప్పారు. అక్కడికి ఓ టెక్నీషియన్ ను పంపించినట్లు తెలిపారు.