తెలంగాణ ఎన్నికలు.. కొన్ని చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్
- ఓటేసేందుకు తరలివస్తున్న ప్రజలు
- సిద్దిపేట, నిజామాబాద్ సూర్యాపేట, నాగార్జునసాగర్‌లో మొరాయించిన ఈవీఎంలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో ఉన్న 167 నెం.పోలింగ్ బూత్, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89, నాగార్జునసాగర్ 103 నెం.పోలింగ్ బూత్‌లో ఈవీఎంల కారణంగా ఆటంకాలు ఎదురయ్యాయి. ఫలితంగా కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.