సాయంత్రం గం.5 లోపు పోలింగ్ కేంద్రంలో ఉంటేనే ఓటు వేసే అవకాశం!
- రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడితే ఓటు వేయవచ్చు
- ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉండదు
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించరు. కానీ సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర వరుసలో/క్యూలో నిలుచుకుంటే మాత్రం ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కనుక ఎన్నికల నియమావళి ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటే ఓటు వేయవచ్చు. క్యూ ఎంత పొడవు ఉన్నా మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. కానీ ఐదు దాటిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే అవకాశం ఉండదు.