విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ
- రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు
- నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ పిల్
- హైకోర్టులో పిటిషన్ వేసిన వెలగపూడి రామకృష్ణబాబు, మూర్తి యాదవ్
- విచారణ డిసెంబరు 27కి వాయిదా
ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇవాళ్టి విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. రుషికొండ పరిస్థితులపై డిసెంబరు మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పంపే బృందం పరిశీలన చేపడుతుందని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. ఆ బృందం రుషికొండ పరిస్థితులపై నివేదిక రూపొందించి సమర్పిస్తుందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది.