Virat Kohli: సౌతాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్.. విరాట్ కోహ్లీ దూరం

Virat Kohli taking break form white ball series in South Africa
  • డిసెంబరు 10 నుంచి టీమిండియా సౌతాఫ్రికా టూర్ ప్రారంభం
  • మూడు వన్డేలు, మూడు టీ20, రెండు టెస్టులు ఆడనున్న భారత జట్టు
  • వన్డేలు, టీ20లకు కోహ్లీ దూరం
  • బ్రేక్ తీసుకున్నట్టు చెబుతూ బీసీసీఐకి సమాచారం
ఇటీవల ముగిసిన ప్రపంచప్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో వైట్‌‌బాల్ సిరీస్‌కు దూరం కానున్నాడు. సిరీస్ నుంచి తాను బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతూ బీసీసీఐకి తెలియజేశాడు. డిసెంబరు 10 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య వన్డే, టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా జరుగుతుంది. వైట్‌బాల్ సిరీస్‌ నుంచి బ్రేక్ కోరిన కోహ్లీ, టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని సమాచారం. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ త్వరలోనే సౌతాఫ్రికాలో పర్యటించే బారత జట్టును ఎంపిక చేయనుంది. 

గత కొంతకాలంగా నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌కు ముందు కూడా కోహ్లీ ఒకసారి క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెస్ట్ తీసుకుని ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం యూకేలో ఉన్న కెప్టెన్ రోహిత్‌శర్మ వైట్‌బాల్ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Virat Kohli
South Africa Tour
Team India
Rohit Sharma

More Telugu News