కొడుకు ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా
- ముఖం కనిపించకుండా ఫొటో పోస్ట్ చేసిన స్టార్ పేసర్
- ‘మై లిటిల్ సన్‌షైన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన బుమ్రా
- ‘ మై ఫేవరెట్ బాయ్స్’ అంటూ స్పందించిన భార్య సంజనా గణేశన్
కాగా బుమ్రా భార్య సంజన ఈ ఏడాది సెప్టెంబర్ 4న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బుమ్రా ప్రకటించాడు. పిల్లాడి పేరు ‘అంగద్’అని తెలిపాడు. ‘‘ మా చిన్న కుటుంబం కొంచెం పెద్దదైంది. మేము ఎప్పుడూ ఊహించనంతగా మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి!. ఈ రోజు ఉదయం మా పిల్లాడు ‘అంగద్’ని ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికాం’’ అని బుమ్రా వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడిన టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడంతో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.