Josh Englis: విశాఖ టీ20లో ఇంగ్లిస్ విధ్వంసక సెంచరీ... ఆసీస్ భారీ స్కోరు

Josh Inglis century drives Aussies 200 plus score against Team India in Vizag
షార్ట్స్‌లో చూడండి
విశాఖలో టీమిండియాతో తొలి టీ20లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. 

ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ సూపర్ సెంచరీ నమోదు చేయడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్. జోష్ ఇంగ్లిస్ 50 బంతుల్లోనే 110 పరుగులు చేయడం విశేషం. టీమిండియా యువ బౌలర్లను ఇంగ్లిస్ ఉతికారేశాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. 

అంతకుముందు, ఓపెనర్ గా వచ్చిన స్టీవ్ స్మిత్ 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. స్మిత్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. చివర్లో టిమ్ డేవిడ్ (19 నాటౌట్) ధాటిగా ఆడడంతో 200 మార్కు దాటింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Josh Englis
Australia
Team India
1st T20
Vizag

More Telugu News