తగ్గేదే లే.. బర్రెలక్క మ్యానిఫెస్టో చూశారా?
- తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క
- నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ
- ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదలయ్యేలా చూస్తానన్న శిరీష
- నిరుద్యోగ భృతి కోసం పోరాడతానని ప్రతిన
బర్రెలక్క తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అలాగే, పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేయడంతోపాటు నిరుద్యోగులందరికీ భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత శిక్షణ, ఉన్నత చదువుల కోసం కోచింగ్ ఉచితంగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని శిరీష తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.