చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ
- ఇసుక స్కాం కేసులో ఏ2 గా చంద్రబాబు
- ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం
- రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకేనని చంద్రబాబు వాదన
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఏపీఎండీసీ ఫిర్యాదు చేయడంతో సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టింది. అయితే, ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణను చంద్రబాబు ఖండించారు. జగన్ సర్కారు కేవలం రాజకీయ దురుద్దేశంతో, తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేయడంతో పాటు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇసుక ఉచిత పంపిణీ వల్ల ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూరిందని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఏ సంస్థ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని చంద్రబాబు వాదిస్తున్నారు.