శబరిమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 22 ప్రత్యేక రైళ్లు
- అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- తేదీలతో సహా రైళ్ల వివరాలను సోమవారం ప్రకటించిన రైల్వే
- భద్రతా ప్రమాణాలతో నడపడంపై దృష్టి పెట్టిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్
ఇక ఈ నెల 23, 30న కాకినాడ-కొట్టాయం, ఈ నెల 25, డిసెంబరు 2న కొట్టాయం-కాకినాడ, ఈ నెల 24, డిసెంబరు 1 తేదీల్లో సికింద్రాబాద్-కొల్లం, ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని రైల్వే స్పష్టం చేసింది. మరోవైపు ఈ ప్రత్యేక రైళ్లను భద్రతా ప్రమాణాలతో నడపడంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ దృష్టిసారించారు. ఆరు డివిజన్ల అధికారులతో సోమవారం ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అధికారులకు తగిన సూచనలు చేశారు.