హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్యకు అస్వస్థత

Sandeep Sandilya hospitalized on Monday
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ శాండిల్య
  • కార్యాలయంలో ఉండగా ఛాతినొప్పి.. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
  • సందీప్ శాండిల్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కార్యాలయంలో ఉండగా ఛాతినొప్పి వచ్చింది. సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. సందీప్ శాండిల్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు.
Go Back to Shorts
Hyderabad
sandeep sandilya

More Telugu News