చంద్రయాన్-4కి సిద్ధమవుతున్న ఇస్రో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రయాన్-4కి సిద్ధమవుతున్న ఇస్రో

ISRO preparing for Chandrayaan 4
  • లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు సిద్ధమవుతున్న ఇస్రో
  • చంద్రుడిపై నుంచి శాంపిల్స్ ను తీసుకురావడంపై పని చేస్తున్న ఇస్రో
  • వచ్చే 5 - 7 ఏళ్లతో మిషన్ చేపడతామన్న నీలేశ్ దేశాయ్
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్ ను 90 డిగ్రీల ప్రాంతం (చీకటి వైపు)లో ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాల్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపై దిగిన తర్వాత, సెంట్రల్ మాడ్యుల్ అక్కడి నుంచి శాంపిల్స్ ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో చేపడతామని చెప్పారు. 

Advertisement
Chandrayaan-4
ISRO

More Telugu News