Chandrayaan-3: నియంత్రణ కోల్పోయి భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 లాంచ్ వెహికల్

Part Of Chandrayaan3 Launcher Uncontrollably ReEnters Earths Atmosphere Says ISRO
  • జులై 14న చంద్రయాన్ -3 ప్రయోగం 
  • నియంత్రణ కోల్పోయిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం
  • బుధవారం 2.42 గంటలకు ఘటన

చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై దీని ప్రభావ పాయింట్ ఉన్నట్టు అంచనా వేసిన ఇస్రో.. దీని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్లలేడని తెలిపింది. నిన్న మధ్యాహ్నం 2.42 గంటలకు ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు పేర్కొంది. 

చంద్రయాన్-3ని ఈ ఏడాది జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ (ఐఏడీసీ) ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవితకాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది.

  • Loading...

More Telugu News