Virat Kohli: విరాట్ కోహ్లీ రికార్డ్ సెంచరీ పూర్తయ్యాక అనుష్క శర్మ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్

This is Anushka Sharmas reaction after Virat Kohlis 50th ODI century
  • వన్డేల్లో విరాట్ 50వ సెంచరీ కొట్టడంతో మురిసిపోయిన భార్య అనుష్క శర్మ
  • విరాట్‌కి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన అనుష్క
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుధవారం న్యూజిలాండ్‌పై సెమీఫైనల్ మ్యాచ్‌లో రికార్డ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ కొట్టి ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ రికార్డును చెరిపివేశాడు. కోహ్లీ సెంచరీ పూర్తయ్యాక స్టేడియం హోరెత్తిపోయింది.  కోహ్లీ నామస్మరణతో వాంఖడే స్టేడియం మోత మోగింది. మ్యాచ్‌ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్‌ సహా అతిరథ మహారథులు అందరూ నిలబడి మరీ కోహ్లీని చప్పట్లతో అభినందించారు. సచిన్ టెండూల్కర్ సైతం నిలబడి చప్పట్లు కొట్టాడు. అయితే విరాట్ భార్య అనుష్క శర్మ స్పందన ప్రత్యేకంగా నిలిచింది. ఆమె రియాక్షన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

భర్త కోహ్లీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు సాధించడంతో అనుష్క మురిసిపోయింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టింది. అంతేకాదు ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక కోహ్లీకి ఫ్లయింగ్ కిస్‌లు కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐసీసీ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను షేర్ చేసింది. 

కాగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీని సాధించి చరిత్ర సృష్టించాడు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను కోహ్లీ అధిగమించిన విషయం తెలిసిందే.
Virat Kohli
Anushka Sharma
India vs NewZealand
World cup 2023

More Telugu News