మైండ్ ఖరాబైందేమో డాక్టర్ కు చూపించుకో..: ఇంజమాముల్ హక్ పై హర్భజన్ సింగ్ ఫైర్
- హర్భజన్ అప్పట్లో ఇస్లాంలోకి మారేందుకు ఉత్సాహం చూపాడన్న ఇంజమాముల్ హక్
- తను ఏ మత్తులో ఇలాంటి కామెంట్ చేశాడో తెలియదన్న బజ్జీ
- ఇంజమామ్ ను ఎవరైనా మెంటల్ డాక్టర్ కు చూపించాలని రిక్వెస్ట్
ఇటీవల ఇంజమామ్ మీడియాతో మాట్లాడుతూ.. హర్భజన్ సింగ్ అప్పట్లో ఇస్లాం మతంలోకి మారేందుకు ఉత్సాహం చూపించాడని చెప్పాడు. ఈ స్టేట్ మెంట్ కాస్తా వైరల్ కావడంతో భజ్జీ స్పందించాడు. ఇంజమామ్ మందు తాగి వచ్చాడో లేక ఏదైనా స్మోక్ చేశాడో.. దేని మత్తులో ఇలాంటి కామెంట్ చేశాడో తెలియదని అన్నాడు. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రేపొద్దున ఆయనకే గుర్తుండవని హర్భజన్ సింగ్ చెప్పారు.