చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- తమిళనాడులో విస్తారంగా వర్షాలు
- చెన్నైలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్
ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.