టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు
- స్కిల్ కేసులో సీఐడీ దర్యాప్తు
- టీడీపీ ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాల వివరాలు కావాలంటూ నోటీసులు
- ఈ నెల 18 లోపు ఖాతాల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ... అందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
స్కిల్ నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది. వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపారు.