Vijayasai Reddy: అసలు అక్కడ పురందేశ్వరికి ఓటు ఉందా?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Purandeswari
  • పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేసిన విజయసాయి
  • కారంచేడు 145వ బూత్ లో బీజేపీకి 6 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా
  • బావ పక్షపాతి అంటూ విమర్శ

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కారంచేడు 145 బూత్ లో బీజేపీకి కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయని... అసలు అక్కడ పురందేశ్వరికి ఓటు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? అని అడిగారు. మీ బావ పక్షపాతివైన మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటగింపు అయిపోయిందని విమర్శించారు. బీజేపీలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలో... సిద్ధాంతాలను గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే... మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనే ఉండిపోయిందని బొంకుతారని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News