Joe Biden: మరోమారు నవ్వులపాలైన బైడెన్.. వీడియో ఇదిగో!

Joe Biden Calls Vice President Kamala Harris As President
  • కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ గా సంబోధిస్తూ ప్రసంగం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • అమెరికా అధ్యక్షుడిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు
  • బైడెన్ కు ప్రెసిడెంట్ ఎవరో తెలియదంటూ కామెంట్లు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోమారు నవ్వులపాలయ్యారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను అధ్యక్షురాలంటూ సంబోధిస్తూ ప్రసంగించారు. సోమవారం వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు బైడెన్ పై మండిపడుతున్నారు. బైడెన్ కు అమెరికా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియదంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

గత జూన్ లో స్టాన్లీ కప్ గెలిచిన వెగాస్ గోల్డెన్ నైట్స్ టీమ్ ను సత్కరించేందుకు సోమవారం వైట్ హౌస్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రెసిడెంట్ బైడెన్ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ అంటూ సంబోధించడంతో కార్యక్రమానికి హాజరైన వారు అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బైడెన్ పై విమర్శలు గుప్పించారు. పలువురు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

బైడెన్ గతంలోనూ పలుమార్లు నవ్వులపాలైన సందర్భాలు ఉన్నాయి. ఓసారి హ్యారిస్ ను ఫస్ట్ లేడీ అని సంబోధించారు. అమెరికా అధ్యక్షుడి భార్యను ఫస్ట్ లేడీగా వ్యవహరిస్తారు. గత సెప్టెంబరులో జరిగిన మరో కార్యక్రమంలో ప్రముఖ రాపర్ ఎల్ఎల్ జై కూల్ జే పేరును కాంగ్రెషనల్ కార్యక్రమంలో అబ్బాయి అంటూ బైడెన్ తప్పుగా ఉచ్చరించడం విమర్శలకు దారితీసింది.
Joe Biden
USA
Kamala Harris
us president
calls president
Biden
Viral Videos

More Telugu News