బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై అవిశ్వాస లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై అవిశ్వాస లేఖ

UK Prime minister faces no confidence motion
  • సుయెల్లా బ్రెవర్మెన్ తొలగింపుతో బ్రిటన్ రాజకీయల్లో కీలక మలుపు
  • అధికార కన్సర్వేటివ్ పార్టీలోని 1922 కమిటికీ అవిశ్వాస లేఖ రాసిన సొంత పార్టీ ఎంపీ
  • లెఫ్ట్ భావజాల నేతల ఒత్తిడితో రిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్య
  • నిజం మాట్లాడినందుకు సుయెల్లా బ్రెవర్మెన్ పదవి కోల్పోయారని విచారం
బ్రిటన్ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. హోం శాఖ మంత్రి సుయెల్లా బ్రెవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర విమర్శల పాలవుతున్న రిషి సునాక్‌‌పై సొంత పార్టీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ అవిశ్వాస తీర్మానం లేఖ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం తాలూకు ఫొటోను నెట్టింట పంచుకున్నారు. 

‘‘జరిగింది చాలు. రిషి సునాక్ పక్కకు తప్పుకోవాల్సిందే’’ అని జెంకిన్స్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అవిశ్వాస తీర్మానం తాలూకు లేఖను పార్టీలోని 1922 కమిటీకి పంపినట్టు చెప్పారు. ‘‘నిజం మాట్లాడినందుకు ఆమెను తప్పించారు. పార్టీలోని లెఫ్ట్ నేతల ఒత్తిడికి లోనై రిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. పాలస్తీనా అనుకూల ప్రదర్శన విషయంలో పోలీసులు ఉదారంగా వ్యవహరించారంటూ విమర్శించిన సెయెల్లా బ్రెవర్మెన్ తన మంత్రి పదవి కోల్పోవాల్సిన విషయం తెలిసిందే. 

కాగా, రిషి సునాక్‌పై జెంకిన్స్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పక్కకు తప్పుకోవడానికి కూడా రిషి సునాక్ కారణమని ఆరోపించారు. బ్రెక్జిట్ కోసం బోరిస్ పార్లమెంటులో ధైర్యంగా పోరాడారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పదవుల్లో లేని అధికార పార్టీ ఎంపీలు 1922 కమిటీలో ఉంటారు. ఈ కమిటీ సభ్యులు ప్రభుత్వ, తమ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయగలరు.
Advertisement
Rishi Sunak-No confidence
UK

More Telugu News