ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం.. ఆరో తరగతి బాలికపై ఇద్దరు ఉపాధ్యాయుల అత్యాచారం
- నబరంగ్‌పూర్ జిల్లాలో ఘటన
- బాలిక టాయిలెట్‌లో ఉండగా బలవంతంగా వెళ్లి అత్యాచారం
- కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
- బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించిన వైద్యులు
- హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడి అరెస్ట్
- రాష్ట్రవ్యాప్తంగా దుమారం
పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగికదాడి జరిగినట్టు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య వైద్యాధికారిని కోరింది. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.