ఏఏజీ గైర్హాజరు... చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఆరోపణలు
- ఇటీవలే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
- విచారణలో ఉన్న పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్
- నేటి విచారణకు ఏఏజీ రాలేకపోతున్నారని కోర్టుకు తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా... అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు గైర్హాజరయ్యారు. ఏఏజీ నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.