World Cup: వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ తుది విడత టికెట్ల విక్రయం నేడే

Final set of world cup semifinals and final tickets last batch tickets sales will go live today
షార్ట్స్‌లో చూడండి
భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఒక్కో జట్టు 9 మ్యాచ్ లు ఆడితే లీగ్ దశ ముగుస్తుంది. బరిలో ఉన్న అన్ని జట్లు ఎనిమిదేసి మ్యాచ్ లు ఆడాయి. అన్ని జట్లు మరొక్క మ్యాచ్ చొప్పున ఆడాల్సి ఉంది.

ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను నేడు విక్రయించనున్నారు. 

రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ కోసం ఇవాళ రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి వస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. వరల్డ్ కప్ టోర్నీని ప్రత్యక్షంగా స్టేడియంలకు వెళ్లి చూడాలనుకునే అభిమానులకు ఇదే చివరి అవకాశం. దీంతో టికెట్ల అమ్మకాలు పూర్తవుతాయని బీసీసీఐ పేర్కొంది.
Go Back to Shorts
World Cup
Tickets
Semifinals
Finals
BCCI

More Telugu News