వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాన్వాయ్‌ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
Add ap7am to your home Screen

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాన్వాయ్‌ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

YCP MP Vijayasai Reddys convoy collided with a person and injured
  • బుధవారం ఉదయం ఒంగోలులో జరిగిన ప్రమాదం
  • బైక్‌పై వెళ్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
  • ఎంపీ ప్రయాణిస్తున్న వాహనమే ఢీకొట్టిందని చెబుతున్న స్థానికులు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం బుధవారం ఉదయం బైక్‌ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. కనిగిరిలో నిర్వహించిన వైసీపీ ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’లో పాల్గొనేందుకు ఒంగోలు నుంచి కాన్వాయ్ వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒంగోలు నగర పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో పునాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రమైన గాయాలయ్యాయి. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న కారే బైక్‌ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. మరో వాహనంలో ఎంపీ వెళ్లిపోయారని అంటున్నారు. 


పేర్నమిట్ట సమీపంలో ఉన్న పొగాకు వేలం కేంద్రం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితుడికి తీవ్రమైన గాయాలవ్వడంతో హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు నాగేశ్వరరావు బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతలకు చెందినవాడని, పేర్నమిట్టలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.
Advertisement
Andhra Pradesh
Vijay Sai Reddy
YSRCP
Road Accident

More Telugu News