విజయవాడ బస్సు ప్రమాదం ఘటనలో ఆరోపణలు .. యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజీ ఇదిగో!
- సరిగా శిక్షణ ఇవ్వకుండానే డ్రైవర్ కు ఆటో ట్రాన్స్ మిషన్ బస్సు అప్పగింత
- ఎక్స్ లేటర్ సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు
- తప్పంతా డ్రైవర్ దేనని చేతులు దులుపుకునే ప్రయత్నంలో అధికారులు
డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వకుండా ఆటో ట్రాన్స్ మిషన్ బస్సు అప్పగించిన అధికారులు.. ప్రమాదానికి కారణం డ్రైవరేనని నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు చేతులు దులుపుకునే మార్గం వెతుకుతున్నట్లు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కాగా, బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు తాజాగా విడుదల చేశారు.