CM Kcr: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం

CM Kcr Helicopter Emergency Landing due to Technical Fault
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కాసేపటికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే హెలికాఫ్టర్ ను ఎర్రవల్లికి మళ్లించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లోని హెలిప్యాడ్ పై క్షేమంగా దించారు. సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో హెలికాఫ్టర్ ను సిద్ధం చేస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.

Go Back to Shorts
CM Kcr
Helicopter
Emergency Landing
Technical Fault
Erravalli

More Telugu News