తెలంగాణను గెలుద్దామంటూ రేవంత్ రెడ్డి ట్వీట్
- 6న నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడి
- కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పీసీసీ చీఫ్
- డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్
ఈమేరకు కాంగ్రెస్ జెండా చేతిలో పట్టుకుని ఉన్న ఫొటోను రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ కు జతచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పది గంటలకు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.