Varun Tej-Lavanya Marriage: లావణ్య పెళ్లిచీరకో ప్రత్యేకత.. మురిసిపోతున్న నెటిజన్లు

Varun lav  infinity writes on Lavanya Tripathi marriage saree
  • ఇన్ఫినిటీ సింబల్‌తో ‘వరుణ్-లావ్’  అని తెలుగులో రాయించుకున్న లావణ్య
  • తమ ప్రేమ  అనంతమన్న ఉద్దేశంతో అలా  రాయించి ఉండొచ్చంటున్న అభిమానులు
  • రేపు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో రిసెప్షన్

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి తాజాగా వరుణ్‌తేజ్‌ను పెళ్లాడి మెగా ఇంటి కోడలుగా మారింది. ఇటలీలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధువులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహం సందర్భంగా లావణ్య  కట్టుకున్న కాంచీపురం చీరకు ఓ ప్రత్యేకత ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ఈ చీరపై లావణ్య, వరణ్ ముద్దుపేర్లు ఉన్నాయి. చీరపై తెలుగులో ‘వరుణ్-లావ్’ అని రాయించి ఇన్ఫినిటీ సింబల్ వేయించారు. అంటే.. తమ ప్రేమ అనంతమన్న ఉద్దేశంతో అలా రాయించి ఉండొచ్చని అభిమానులు చెబుతున్నారు. తెలుగింటి కోడలు అయిన లావణ్య తన పెళ్లి చీరపై తెలుగులో ఇలా రాయించడం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. వీరి వివాహం ఇటలీలో జరగడంతో ఆదివారం(5న) హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఇవ్వనున్నారు. 

మరోవైపు, ఇటలీలో పెళ్లి వేడుక ముగియడంతో మెగా ఫ్యామిలీలోని ఒక్కొక్కరు హైదరాబాద్ చేరుకుంటున్నారు. పవన్ కల్యాణ్ నిన్ననే హైదరాబాద్ చేరుకోగా, ఆ తర్వాత చిరంజీవి, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్ నగరానికి చేరుకున్నారు. నేడు వరుణ్‌తేజ్-లావణ్య జంట చేరుకుంటారు.

  • Loading...

More Telugu News