నేపాల్ కు అన్ని విధాలుగా అండగా ఉంటాం: భారీ భూకంపంపై మోదీ స్పందన
- రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం
- కనీసం 128 మంది దుర్మరణం
- ఎంతో ఆవేదన కలుగుతోందన్న మోదీ
ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... నేపాల్ లో భూకంపం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఇండియా ఉంటుందని... అన్ని రకాల సహాయ సహకారాలను నేపాల్ కు అందిస్తామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)ను ట్యాగ్ చేశారు.