తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఈ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం: వైఎస్ షర్మిల
- కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించిన షర్మిల
- కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్య
- కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు వెల్లడి
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని... తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని... అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.