India: థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గుడ్‌న్యూస్

Good news for Indians who want to visit Thailand
  • వీసా లేకుండానే భారత పౌరుల పర్యటనకు గ్రీన్‌సిగ్నల్
  • 30 రోజులపాటు అక్కడే గడిపే ఛాన్స్
  • నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఆఫర్
థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశం గుడ్‌న్యూస్ చెప్పింది. వీసా లేకుండానే భారతీయులను ఆహ్వానించే దేశాల సరసన థాయ్‌లాండ్ కూడా చేరింది. పర్యాటక రంగానికి ఊతమివ్వడమే లక్ష్యంగా భారత్, తైవాన్ దేశాల పౌరులు వీసా లేకుండానే పర్యటించే అవకాశం కల్పించింది. ఇందుకు అనుమతినిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10 నుంచి వచ్చే సంవత్సరం మే 10 వరకు ఈ వెసులుబాటు భారతీయులకు అందుబాటులో ఉంటుంది. 30 రోజులపాటు వీసా లేకుండానే అక్కడ గడపొచ్చు.

ఈ మేరకు ప్రధాని శ్రేట్టా థవిసిన్ నేతృత్వంలోని థాయ్‌లాండ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోకి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. మలేసియా, చైనా, దక్షిణకొరియా దేశాల తర్వాత భారత్ నుంచే థాయ్‌లాండ్‌కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గడిచిన నెలలో చైనా పౌరులకు వీసా రహిత పర్యటనకు థాయ్‌లాండ్ అవకాశం కల్పించింది. మరోవైపు ఇటీవలే శ్రీలంక కూడా భారత పౌరులకు వీసా లేకుండానే దేశంలో పర్యటించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
India

More Telugu News