Telugudesam: చంద్రబాబు ఇంటికి చేరుకున్న సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణం.. ఫొటోలు ఇవిగో!

A emotional atmosphere at Chandrababus house in Undavalli
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
  • 53 రోజుల తర్వాత ఇంటికి చేరుకోవడంతో భావోద్వేగ క్షణాలు
  • నేతలను ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజమండ్రి మొదలుకొని ఇంటికి చేరుకునే వరకు దారిపొడవునా టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతాలు పలికారు. దాదాపు 53 రోజుల తర్వాత  ఆయన ఇంటికి చేరుకోవడంతో నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం కనిపించింది.

టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గుమ్మడికాయలు కొట్టి, హారతులు పట్టి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. 53 రోజుల తర్వాత చంద్రబాబును ఆయన నివాసం వద్ద సమీపం నుంచి చూసిన నేతలు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. వారందరిని చూసి చంద్రబాబు కూడా ఎమోషనల్‌గా కనిపించారు. నేతలందరినీ దగ్గరకు తీసుకొని పలకరించారు.

వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. నేతలు, కార్యకర్తలు పెల్లుబుకిన ఆనందంతో కనిపించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు చంద్రబాబు నివాసం వద్ద కనిపించారు.
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News