కాంగ్రెస్ కు పీజేఆర్ కొడుకు రాజీనామా
- జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్
- అజారుద్దీన్ కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్ఠానం
- పీజేఆర్ కూతురుకు ఖైరతాబాద్ టికెట్
నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుచరులు, అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది.